
లక్ష్మీ నృసింహుని సన్నిధిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలమ్ సాహ్ని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద కమిషనర్ సాహ్నికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనాలు పలికారు. వారికి స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదంను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ అందజేశారు. తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, మండల ఆర్‌ఐ వి.రామరాజు, వీఆర్వో ప్రసాద్ పాల్గొన్నారు.
స్వామివారి ఆదాయం రూ.2,25,339
ఆలయంలో స్వామివారి లడ్డు ప్రసాదం విక్రయాలు, ప్రత్యేక దర్శనములు, వివిధ సేవల టికెట్లు ద్వారా రూ.1,12,272, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తుల విరాళాలు ద్వారా రూ.1,13,067 కలిపి మొత్తం రూ.2,25,339 ఆదాయం వచ్చినట్టు ఏసీ ప్రసాద్ తెలిపారు.