
అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం తెల్లవారుజామున ఓ సిటీ కేబుల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అందులోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీఆర్వో కొత్తపల్లి కృష్ణమూర్తి డాబా ఇంటిలో కింద ఫ్లోర్‌లో నిర్వహిస్తున్న కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విలువైన యంత్ర పరికరాలు, సెట్‌టాప్ బాక్స్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పరిశీలించారు.
అగ్నిప్రమాదంలో
కాలిపోయిన
యంత్ర
పరికరాలు