
పంట కాలువల ఆక్రమణల తొలగింపునకు చర్యలు
జల వనరులశాఖ ఇంజినీర్లకు జేసీ ఆదేశం
అమలాపురం రూరల్: జిల్లాలో పంట కాలువల వెంబడి ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగింపునకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జేసీ టి.నిశాంతి జలవనరుల శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, జలవనరులశాఖ ఇంజనీర్లు, మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులతో ఆమె సమీక్షించారు. జల వనరులశాఖ పరిధిలో ఉన్న ఆక్రమణల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సత్వరం వాటిని తొలగించాలని సూచించారు. ఆర్డీవోలు జలవనరుల శాఖ ఇంజినీర్ల సమన్వయంతో చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రాజకుమారి కె.మాధవి, పి.శ్రీకర్, బి.అఖిల, జలవనరుల శాఖ ఇంజినీర్లు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నగరం ఘటన
మృతులకు నివాళి
మామిడికుదురు: గెయిల్ హామీల అమలుకు అవసరమైతే పోరాడేందుకు సిద్ధమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. నగరం గ్రామంలో గెయిల్ విస్ఫోటం జరిగి 11 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నాటి ఘటనలోని మృతుల చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీ వద్ద వారికి నివాళులర్పించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్ర మాదం జరిగిందన్నారు. అప్పట్లో ఇచ్చిన హామీ ల్లో 11 హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. వాటిని సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకు వెళ్లానని, దీనిపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని, అవసరమైతే బాధితుల తరఫున పోరాడతానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, బీజేపీ జి ల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, నియోజకవర్గ మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల 4న జేఎన్‌టీయూకే
స్నాతకోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ–కాకినాడ 11వ స్నాతకోత్సవం వచ్చే నెల ఇన నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ముఖ్య అతిథిగా వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని, ముఖ్య అతిథి బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రమ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని వివరించారు. స్నాతకోత్సవంలో భాగంగా 2023–24కు సంబంధించి బీటెక్ 41,258, బీ–ఫార్మసీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఫార్మా–డి 274, బీఆర్క్ 83, పీహెడ్‌డీ 100, బంగారు పతకాలు 40 ప్రకటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు మాజీ వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు.
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితుడు ఉపాధ్యాయుల రమేష్, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకులు బాలు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో 20 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు.

పంట కాలువల ఆక్రమణల తొలగింపునకు చర్యలు

పంట కాలువల ఆక్రమణల తొలగింపునకు చర్యలు