
వ్యవసాయ శాఖ సూచనలు తప్పనిసరి
వరిసాగులో వ్యవసాయశాఖ సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. గతంలో రైతులు కేవలం వరినాటు పద్ధతిని మాత్రమే అవలంబించేవారు. ప్రసుత్తం వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల వెదజల్లు విధానంలోను రైతులు అధికంగా సాగు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం స్థానికంగా కూలీల కొరతను ఎదుర్కొనేందుకు బెంగాలీ కూలీలను వినియోగించుకోవడం అహ్వానించదగ్గ పరిణామం.
– కె.నాగేశ్వరరావు, డివిజనల్
వ్యవసాయాధికారి, అలమూరు
బెంగాలీ కూలీలతో
నాట్లు వేగవంతం
వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది ఖరీఫ్ పనులు త్వరగా ప్రారంభించాం. కొన్నేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్నాను. బెంగాలీ కూలీలతో వరినాట్లు వేయించడానికే ప్రాధాన్యమిస్తున్నాం. వారు ఊడ్పు యంత్రం తరహాలో నాట్లు వేశారు. దీనివల్ల ఖర్చు తగ్గింది. చీడపీడల బెడద తగ్గింది. ఎకరానికి ఐదు బస్తాల ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను.
– కొత్తూరు సాయి రామకృష్ణ, రైతు, పినపళ్ల