
22ఎ భూముల జాబితా పబ్లిష్ చేయాలి
ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్
రామచంద్రపురం రూరల్: 22ఎ భూముల విషయంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. రామచంద్రపురం మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన చర్చలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఆఖరికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తి కూడా రైతుల భూములు 22ఏలో పెట్టేలా పరిస్థితులు ఉన్నాయన్నారు. దీనివల్ల చాలా మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే గ్రామ స్థాయిలో 22 ఏ భూముల జాబితాను పబ్లిష్ చేయాలని ఆయన సూచించారు.