ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

May 5 2025 8:10 AM | Updated on May 5 2025 8:10 AM

ఉపాధ్

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

ఆకస్మికంగా విడుదల

ప్రత్యేక తరగతుల షెడ్యూల్‌ను అకస్మాత్తుగా విడుదల చేశారు. మిడ్‌ సమ్మర్‌లో రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉత్వర్వులు ఇవ్వడం సమంజసం కాదు.

– పి.సురేంద్రకుమార్‌,

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ఆర్జిత సెలవులు మంజూరు చేయాలి

అంగీకారం తెలిపిన ఉపాధ్యాయులతో మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. వారికి కచ్చితంగా ఆర్జిత సెలవులు మంజూరు చేయాలి. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు వేసవి సెలవులకు దూరప్రాంతాలకు వెళ్లారు. వారిని బలవంతంగా రప్పించడం సరికాదు.

– పోతంశెట్టి దొరబాబు,

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

విద్యాశాఖ ఉత్తర్వులపై అసంతృప్తి

ఇది సరికాదంటున్న సంఘాల నేతలు

రాయవరం: వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం ఎంతవరకూ సమంజసమని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. వేసవి సెలవుల దృష్ట్యా సాధారణంగా మార్చి 15 నుంచి పాఠశాలలను ఒంటి పూట నిర్వహిస్తారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలలో ఫెయిలైన విద్యార్థులకు మే నెలలో రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు తీసుకుంటున్న టీచర్లను వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. పది పరీక్షలకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నాన్‌ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తూ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు.

3వ తేదీన ఉత్తర్వులు

పది ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈ నెల 2న ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఉత్తర్వులు 3వ తేదీన ఉపాధ్యాయ, వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేయడంతో ఉపాధ్యాయులు మండు వేసవిలో ఇదెక్కడి న్యాయమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానరాని ఈఎల్‌ ప్రస్తావన

విద్యాశాఖ ఉత్తర్వుల్లో ఎక్కడా ఆర్జిత సెలవుల ప్రస్తావన లేకపోవడం, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించాలని, ఆదివారం, సెలవు దినాల్లో కూడా పనిచేయాలని పేర్కొనడం ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి రగిలించింది. పరీక్షలకు ముందు వంద రోజుల ప్రణాళిక, దసరా, సంక్రాంతి సెలవుల్లో పనిచేసిన వారికి సీసీఎల్‌ మంజూరు చేస్తామని నేటికీ ఇవ్వకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ప్రత్యేక తరగతులపై ఉపాధ్యాయ సంఘాలు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పునరాలోంచించాలి

ప్రత్యేక తరగతుల ఉత్తర్వులపై విద్యాశాఖ డైరెక్టర్‌ పునరాలోచించాలి. ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తున్నా విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుంది.

– దీపాటి సురేష్‌బాబు, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

సీసీఎల్స్‌ మంజూరు చేయాలి

పది పరీక్షలకు ముందు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేశాం. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవు దినాల్లో పనిచేసిన వారికి సీసీఎల్స్‌ మంజూరు చేయాలి. ఈఎల్స్‌ ఇవ్వకుంటే బహిష్కరణకు పిలుపునిస్తాం. – పెచ్చెట్టి నరేష్‌బాబు, ఆపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష1
1/5

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష2
2/5

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష3
3/5

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష4
4/5

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష5
5/5

ఉపాధ్యాయులకు ప్రత్యేక పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement