
యోగాపై అవగాహన కార్యక్రమాలు
అమలాపురం రూరల్: రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామ స్థాయి వరకు యోగా అభ్యసన అవగాహన కార్యక్రమాలు నెల రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించి యోగ అభ్యసన, శిక్షణ కార్యక్రమాలవిధి విధానాలపై సమీక్షించారు.
రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ
జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీని పునః ప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని జేసీ నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్ ఎల్పిజి, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించి డీలర్ల ద్వారా రేషన్ సరఫరా, దీపం–2 సిలిండర్ ఖరీదు ముందస్తుగానే ఆన్‌లైన్‌లో లబ్ధిదారులు ఖాతాకు జమ చేయడం, డెలివరీ అంశాలపై సమీక్షించారు. డీఎస్‌ఓ ఉదయ భాస్కర్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కుమారి ఎం.బాలసరస్వతి, ఎల్పీజీ డీలర్ల ప్రతినిధి త్రినాథ్, రేషన్ డీలర్ల ప్రతినిధి అడపా వెంకట రమణ పాల్గొన్నారు.