
23న పదో తరగతి ఫలితాలు
అమలాపురం రూరల్: ఈనెల 23వ తేదీ బుధవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాలు లీప్ యాప్‌లో పాఠశాలల వారీగా కూడా విడుదల చేస్తున్నట్టు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్స్‌లో
మెరిసిన ‘శివ సాయి హర్ష’
రాజోలు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కాట్రేనిపాడు గ్రామానికి చెందిన పైడిపర్తి శివ సాయి హర్ష 47వ ర్యాంక్ సాధించాడు. తండ్రి పైడిపర్తి వీర వెంకట సత్యనారాయణమూర్తి (చిన్ని) టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తల్లి లక్ష్మీకళ గృహిణి. తమ కుమారుడు జాతీయ స్థాయిలో 47వ ర్యాంక్ సాధించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
24 నుండి అటల్
సమ్మర్ బూట్ క్యాంప్
అమలాపురం రూరల్: ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అటల్ సమ్మర్ బూట్ క్యాంప్ – 2025 నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖధికారి షేక్ సలీం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేరూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో శాసీ్త్రయత, కృషి ఆధారిత బోధన వైపు మరొక ముందడుగు వేసేలా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం డీఈవో, హబ్ స్కూల్ కోఆర్డినేటర్ పద్మావతి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని 45 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను మరింత మెరుగుపరిచి, వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధం చేయడమేకాక, విద్యార్థులలో సృజ నాత్మకతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎం కడలి శ్రీనివాస్ పర్యవేక్షణలో వీటిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో జిల్లా నలుమూలల నుంచి ఎంపికై న ఒక హబ్ పాఠశాల, ఐదు స్పోక్ పాఠశాలల ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తారని, ప్రతి స్పోక్ స్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడు, ఐదుగురు విద్యార్థులు, హబ్ స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు, పది మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొంటారన్నారు. ఈ శిక్షణలో భాగంగా ప్రయోగశాలలో ఉన్న కాంపోనెంట్ల ఉపయోగం, వివిధ రకాల అటల్ ప్రాజెక్టుల రూపకల్పన విద్యార్థులకు ఆవిష్కరణాత్మక ఆలోచనల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణకు పూనే నుంచి విజ్ఞాన ఆశ్రమం ద్వారా ఒక నోడల్ టీచర్‌ను నియమించినట్టు ఆయన తెలిపారు. భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ శిక్షణకు సహకరిస్తారన్నారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ గోదావరి భవన్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు డివిజన్, మండలం, మున్సిపల్ స్థాయిలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. డివిజన్ స్థాయి కార్యక్రమం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో జరుగుతాయని డివిజనల్ స్థాయి అధికారులు అందరూ సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో పాల్గొంటారన్నారు. మండల స్థాయి వేదిక సంబంధిత మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహిస్తారని, మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా గ్రీవెన్స్‌లో పాల్గొనాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సాయిబాబాకు రజత ఛత్రం సమర్పణ
రామచంద్రపురం: పట్టణంలోని కోదండ రామాలయంలో కొలువై ఉన్న శిరిడీ సాయిబాబా వారికి పట్టణానికే చెందిన వాడ్రేవు శ్రీరాజరాజేశ్వరి రామ్మూర్తి రూ. 2.20 లక్షల విలువైన రజత ఛత్రాన్ని సమర్పించారు. రాజరాజేశ్వరి ఇటీవల మృతి చెందిన తన అత్తగారు వాడ్రేవు సుబ్బలక్ష్మి జ్ఞాపకార్ధం కుటుంబ సభ్యులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయిప్రసాద్, రత్న పద్మావతి, వాడ్రేవు శ్రీనివాస్, భానుగాయత్రి, వాడ్రేవు వీరేశలింగం, విన్నకోట శ్రీనివాస్‌లతో కలసి ఆలయ నిర్వాహకుడు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, పాలూరి గోపాలకృష్ణకు ఛత్రాన్ని అందజేశారు.

23న పదో తరగతి ఫలితాలు

23న పదో తరగతి ఫలితాలు