‘తొమ్మిది బుధవారాలు – స్వామి వరాలు’ బ్రోచర్‌ విడుదల | Sakshi
Sakshi News home page

‘తొమ్మిది బుధవారాలు – స్వామి వరాలు’ బ్రోచర్‌ విడుదల

Published Thu, Nov 16 2023 6:10 AM

ఆధ్యాత్మిక బ్రోచర్‌ విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు 
 - Sakshi

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని కృపకై కృష్ణ ధర్మరక్షణ, జై భగరంగ్‌ సంయుక్త ఆధ్వర్యంలో 9 బుధవారాలు–స్వామి వరాలు (9 బుధవారాలు దీక్ష–ప్రచారయాత్ర) ప్రచారంపై ప్రత్యేక ఆధ్యాత్మిక బ్రోచర్‌ను బుధవారం రామేశ్వరంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు విడుదల చేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించి స్వామివారి వరాలు పేరిట ప్రచార గీతాన్ని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ రచించారు. దీనికి సింధూ కె.ప్రసాద్‌ సంగీతాన్ని స్వరపరిచారు. దీనిని ఈ నెల 20న అంతర్వేది ఆలయంలో విడుదల చేయనున్నట్టు డాక్టర్‌ ప్రతాప్‌, ప్రసాద్‌ తెలిపారు. నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ పాటి శివకుమార్‌, సర్పంచ్‌ కట్టా ఉమా మహేశ్వరరావు, నాయకులు కుసుమ రాకేష్‌, నల్లి ప్రేమానందం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement