
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నుపూర్ అజయ్
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే నెల 15 నుంచి జనవరి 26వ తేదీ వరకూ ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడా సంబరాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ క్రీడా సంబరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభు త్వ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న.. ముఖ్యమంత్రి కా ర్యాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల నిర్వహణకు జిల్లా క్రీడా ప్రా ధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోందన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీల నిర్వహణకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. పదిహేనేళ్లు పైబడిన బాలబాలికలు ఈ క్రీడలకు అర్హులన్నారు. ఈ పోటీలకు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి క్రీడాకారులను ఆహ్వానిస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మొత్తం ఐదు దశల్లో 42 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ పోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొనరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. క్రీడాకారుల నమోదు ప్రక్రియను ఈ నెల 20న వలంటీర్లు చేపడతారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 21న క్రీడా కిట్లు పంపిణీ చేస్తారని, 22న స్కోరింగ్ యాప్ చెకింగ్ ఉంటుందని, 25న వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి క్రీడల నిర్వహణపై కరపత్రాలతో అవగాహన కల్పిస్తారని వివరించారు. జిల్లావ్యాప్తంగా 467 గ్రామాలు, 48 వార్డుల్లో ఈ క్రీడా సంబరాలు జరుగుతాయన్నారు. క్రీడల నిర్వహణకు ప్రతి సచివాల యం నుంచి పది మంది వలంటీర్లను ఎంపిక చేసి, జిల్లావ్యాప్తంగా మొత్తం 5,150 మందికి శిక్షణ ఇస్తా మని తెలిపారు. క్రీడా సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జా యింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, జిల్లా క్రీడా ప్రా ధికార సంస్థ ముఖ్య శిక్షకుడు సురేష్ కుమార్, ఆడు దాం ఆంధ్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు రాజు పాల్గొన్నారు.
ఫ జనవరి 26 వరకూ నిర్వహణ
ఫ విజయవంతం చేయాలని
కలెక్టర్ పిలుపు