వేయి శుభములు కలుగు నీకు..
● సంక్షేమ సారధి జగన్‌కు
జన్మదిన శుభాకాంక్షలు
● జిల్లాలో వ్యాప్తంగా కేక్ కటింగులు
● విరివిగా సేవా కార్యక్రమాలు
● వందల సంఖ్యలో రక్తదాన శిబిరాలు
● దుప్పట్లు, రగ్గులు, పండ్ల పంపిణీలు
● భారీగా మోటారు సైకిల్ ర్యాలీలు
సాక్షి, అమలాపురం: సంక్షేమ సారధి.. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం జేజేలు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఆయన జన్మదినోత్సవాన్ని పండగలా నిర్వహించారు. వాడవాడలా కేక్‌లు కట్‌చేసి పంచారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీ కో ఆర్డినేటర్లు నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. పేదలకు, కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఆస్పత్రులలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. పిల్లలకు ఆస్పత్రులలో ఉయ్యాలలు పంచిపెట్టారు.
జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు, ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
రక్తదానం చేసి స్ఫూర్తి నింపారు..
సంక్షేమ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తపేటలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. జగ్గిరెడ్డి స్వయంగా రక్తదానం చేసి కార్యకర్తలలో స్ఫూర్తిని నింపారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు ఉయ్యాలలు, రోగులు, పేదలకు దుప్పట్లు, రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పంచారు. రావులపాలెంలో అంధుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు, పండ్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రన్నకుమార్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బొక్కా వెంకటలక్ష్మి పాల్గొన్నారు. రావులపాలెంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
కేక్‌లు కోసి.. వస్త్రదానాలు చేసి..
అమలాపురం నియోజకవర్గంలో జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా అమలాపురం హై స్కూల్ సెంటర్‌లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచారు. పేదలకు వస్త్రాలు పంచిపెట్టారు. పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు, మాజీ ఎంపీ, సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఏరియా ఆస్పత్రి, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం లూయీ అంధుల పాఠశాల, హరి మనోవికాస కేంద్రం విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అల్లవరం మండలం గోడి గ్రామంలోని తన స్వగృహంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పేదలకు నూతన వస్త్రాలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు ముట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజా కుమారి, షేక్ అబ్దుల్ ఖాదర్, జాన గణేష్, మిండగుదిటి శిరీష్, తోరం గౌతమ్ రాజా తదితరులు పాల్గొన్నారు.
వేయి శుభములు కలుగు నీకు..
వేయి శుభములు కలుగు నీకు..


