రోగులకు పండ్లు పంపిణీ
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
113 మంది రక్తదానం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్‌ఈసీ సభ్యురాలు కాశి బాల మునికుమారి, రాష్ట్ర కార్యదర్శులు పెన్మత్స చిట్టి రాజు, పెయ్యిల చిట్టిబాబు పాల్గొన్నారు.


