
సాక్షి, మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త క్రిస్మస్ పండుగకు పుట్టింటికి పంపించలేదని మనస్తాపంతో ఆమె బిడ్డలతో సహా చెన్నాపురం చెరువులో దూకేసింది. మృతులు నాగమణి (25), రూబీ (5), పండు (3 నెలలు)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.