పూరి గుడిసెలో పిల్లల శవాలు

రాంచీ : పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, రాంచీకి సమీపంలోని చన్హా ప్రాంతానికి చెందిన మనీష్ ఓరన్(12), గణేష్ భగవత్(16)లు ఆదివారం ఓ పొలంలోకి వెళ్లే విషయమై కొంతమంది బాలురతో గొడపడ్డారు. ఆ సాయంత్రమే గ్రామ శివారులోని పూరి గుడిసెలో శవాలై కనిపించారు. మనీష్ శవం గుడిసెకు వేళాతుండగా.. భగవత్ శవం నేలపై పడి ఉంది. ( హోటల్ గదిలో అత్యాచారం.. వీడియో తీసి..)
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడి నేలపై ఓ కర్రను గుర్తించారు. ఆ కర్రతోటే ఇద్దర్నీ కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిన్నారుల మృతిపై ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రాంచీ-పలాము జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనలు తెలియజేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి