ధూమ్ 2 సినిమా స్ఫూర్తితో దొంగతనాలు

న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ధూమ్ 2 సినిమా స్ఫూర్తితో రైలులో దొంగతనాలు చేశాడో దొంగ. హృతిక్ లాగా వేశాలు మారుస్తూ మోసాలు చేశాడు. చివరకు కారు దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌కు చెందిన రఘు ఖోస్లా అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. తరచూ దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్ అనే 36 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్‌తో కలిసి ఓ కారును దొంగిలించాడు. దీంతో కారు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ( కొడుకు పేరిట కొరియర్: తండ్రికి షాక్! )
అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారులో అమర్చబడిన జీపీఎస్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం శ్రీకాంత్, రఘులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. హృతిక్ రోషన్ సినిమా ధూమ్ 2ను స్ఫూర్తిగా తీసుకుని తాను దొంగతనాలు చేయటం ప్రారంభించానని, రాజధాని, శతాబ్ది రైళ్లలో వేషాలు మారుస్తూ దొంగతనాలు చేసేవాడినని రఘు తెలిపాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి