పరాఠాల కోసం.. క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి

They Hijacked A Car Because They Were Craving Parathas - Sakshi

న్యూఢిల్లీ: హరియాణాలో ప్రసిద్ధి చెందిన పరాఠాలు తినడానికి అవసరమైన డబ్బుల కోసం ఓ క్యాబ్‌ డ్రైవర్‌ని దోచుకున్న వారిలో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఐదుగురు స్నేహితులు హరియాణా ముర్థాల్‌ వెళ్లి పరాఠాలు తినాలని భావించారు. కానీ డబ్బులు లేవు. దాంతో దొంగతనం చేయాలనుకుని.. క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. కొద్ది దూరం వెళ్లాక ప్రయాణం గురించి వివాదం తలెత్తింది. దాంతో ట్రిప్‌ క్యాన్సలయ్యింది. ఈ క్రమంలో వారు క్యాబ్‌ డ్రైవర్‌ మీద దాడి చేసి అతడి వద్ద ఉన్న డబ్బులు, మొబైల్‌ లాక్కొని కారు నుంచి బయటకు తోశారు. అనంతరం వారంతా ఢిల్లీ పస్చిమ్ విహార్‌కి వెళ్లి భోజనం చేశారు. (చదవండి: ఇంట్లో చొరబడి ఎవర్నీ వదల్లేదు)

కారును నిహాల్‌ విహార్‌ ప్రాంతంలోని ఏకాంత ప్రదేశంలో పార్క్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఐదుగురిలో ముగ్గురుని అరెస్ట్‌ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top