రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి, నీతోపాటే నేనంటూ.. | Tamil Nadu: Woman Commits Suicide After Lover Dies In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి, నీతోపాటే నేనంటూ..

Mar 19 2021 7:49 AM | Updated on Mar 19 2021 9:10 AM

Tamil Nadu: Woman Commits Suicide After Lover Dies In Road Accident - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు: ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మనస్తాపం చెంది ప్రియురాలు గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై వేళచ్చేరి, మేడవాక్కం పిళ్లయార్‌కోయిల్‌ వీధికి చెందిన సరస్వతి (19). అక్క ఇంటిలో ఉంటూ చదువుతోంది. ఈక్రమంలో బంధువును సరస్వతి ప్రేమించింది. ప్రియుడు పది రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అంత్యక్రియల కోసం సొంతూరు ఆరణికి వచ్చిన సరస్వతి తిరిగి బుధవారం మేడవాక్కంకు వచ్చింది. ప్రియుడు మృతితో మనస్తాపం చెందిన సరస్వతి గురువారం ఉదయం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: విషాదం: కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement