
ముంబై: మహారాష్ట్రలో భయంకరమైన దొంగతనం వెలుగులోకి వచ్చింది. పట్టపగలే ఓ కార్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని కొందరు దుండగులు ఉద్యోగులను తుపాకీతో బెదిరించి కోటి రూపాయలకు పైగా నగదుతో పరారయ్యారు. ఈ ఘటన ముంబైలోని ములుంద్ ప్రాంతంలోని ఆర్థిక సేవలు అందించే కార్యాలయంలో ఫిబ్రవరి 2న చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇందులో నలుగురు దుండగులు మాస్క్‌లు ధరించి కార్యాలయంలోకి వచ్చి.. పిస్టల్‌తో ఉద్యోగులను బెదిరించడం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆపై కార్యాలయంలో ఉంచిన డబ్బును దోచుకెళ్లారు. అయితే కార్యాలయ యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: స్కూల్ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి
#WATCH A case has been registered against 3 unidentified miscreants who robbed around Rs 1 crore from an office at 'gunpoint' in the Mulund area of Mumbai (02.02)
— ANI (@ANI) February 2, 2022
(Video Source: Mumbai Police) pic.twitter.com/vLoVdvrPcw