డబ్బు, బంగారం సర్దుకొని వివాహిత లిఖిత అదృశ్యం | Married Woman Packed Money Gold And Disappears | Sakshi
Sakshi News home page

డబ్బు, బంగారం సర్దుకొని వివాహిత లిఖిత అదృశ్యం

Feb 4 2022 11:40 AM | Updated on Feb 4 2022 11:49 AM

Married Woman Packed Money Gold And Disappears - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెందుర్తి(విశాఖ జిల్లా): పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పురుషోత్తపురం చాకలిపేటకు చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. కాలనీకి చెందిన ఎం.విజయలక్ష్మి అలియాస్‌ లిఖితకు అదే ప్రాంతానికి చెందిన పుచ్చ గౌరిప్రసాద్‌తో గత ఏడాది నవంబర్‌ 21న ప్రేమ వివాహం జరిగింది. 

అయితే బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్న రూ.లక్ష నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, వస్త్రాలు సర్దుకుని లఖిత బయటకు వెళ్లిపోయింది. గౌరీ ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శ్రీను ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ కె.ఎస్‌.కె.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement