మహిళ కొంపముంచిన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌! | Man Robbed Facebook Friend House In Krishna District | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ స్నేహం.. మహిళ ఇంటికి కన్నం..

Oct 16 2020 4:49 PM | Updated on Oct 16 2020 5:01 PM

Man Robbed Facebook Friend House In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : ఫేస్‌బుక్‌ ద్వారా మహిళతో పరిచయం పెంచుకుని ఆమె ఇంట్లోనే చోరీకి పాల్పడి జైలు పాలయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. నూజివీడు డీఎస్‌పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన అల్లు వసంత అనే మహిళతో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన కర్నాటి ప్రవీణ్ రెడ్డి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి తరచూ తూర్పు దిగవల్లిలోని వసంత ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. ( బయటపడుతున్న దొంగ బాబా బాగోతాలు )

ఓ రోజు వసంత ఇంటిలో లేని సమయంలో దాదాపు 3 లక్షల రూపాలయ విలువైన బంగారు నగలను అపహరించుకు పోయాడు. నగలు కనిపించకపోయే సరికి వసంత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న నూజివీడు రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం విషయం బయటపడింది. ప్రవీణ్ రెడ్డి వద్ద నుండి నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడ్ని జైలుకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement