అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష  

Malur MLA Convicted In Cheque Bounce Case Fined 49 Lakhs - Sakshi

సాక్షి, యశవంతపుర: చెక్‌బౌన్స్‌ కేసులో కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కెవై నంజేగౌడకు బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు రూ.49.65 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మలూరుకు చెందిన జి రామచంద్ర అనే వ్యక్తి నుంచి నంజేగౌడ రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఎన్నేళ్లయినా అప్పు చెల్లించలేదు.

దీంతో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల 24వ ఎసీఎంఎం కోర్టులో ఆయన వ్యాజ్యం వేశారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి జె ప్రీతి అసలు, వడ్డీ కలిసి రూ. 49.65 లక్షలు ఎమ్మెల్యే నంజేగౌడ చెల్లించాలని తీర్పు చెప్పారు. లేని పక్షంలో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top