మతిస్థిమితంలేని మహిళపై లైంగికదాడి! | Karimnagar Old Man Accused Of Sexually Assaulting Girl | Sakshi
Sakshi News home page

మతిస్థిమితంలేని మహిళపై లైంగికదాడి!

Mar 5 2021 9:55 AM | Updated on Mar 5 2021 9:59 AM

Karimnagar Old Man Accused Of Sexually Assaulting Girl - Sakshi

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): మతిస్థిమితం సరిగా లేని యువతికి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి వృద్ధుడు లైంగికదాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (37)కి మతిస్థిమితం సరిగాలేదు. అరవై సంవత్సరాల వృద్ధుడు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి లైంగికదాడి చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. లైంగికదాడి విషయం నాలుగురోజుల నుంచి గోప్యంగా ఉంచారు.

కాగా, బాధితురాలు కుటుంబసభ్యులకు ఆలస్యంగా తెలుపడంతో బయటపడింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మతిస్థిమితం సరిగాలేని యువతిపై జాలి, కరుణలేకుండా ఇలాంటి సంఘటనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశం అయింది.   

చదవండి: వైరల్‌: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement