ఎస్సై ఇంట్లో బంగారం చోరీ | Gold Robbery In Sub Inspector House | Sakshi
Sakshi News home page

19 కాసులు బంగారం అపహరణ 

Feb 3 2021 11:26 AM | Updated on Feb 3 2021 11:34 AM

Gold  Robbery In Sub Inspector House  - Sakshi

పాలకొల్లు సెంట్రల్‌: ఆచంట ఎస్సై రాజశేఖర్‌ ఇంట్లో 19 కాసులు బంగారం చోరీకి గురైంది. పాలకొల్లు సీఐ సీహెచ్‌ ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం ఆచంట ఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్‌ పాలకొల్లు లజపతిరాయ్‌ పేట శివారు ప్రాంతంలో ఉంటున్నారు. సోమవారం రాత్రి విధినిర్వహణలో భాగంగా రాజశేఖర్‌ ఆచంటలో డ్యూటీకి వెళ్లారు. ఇంటి ప్రధాన ద్వారానికి కిటికి బోల్ట్‌ ఊడి ఉంది. ఆ కిటికీలో నుంచి చెయ్యి పెట్టి డోర్‌ లాక్‌ తీసుకుని దొంగ గదిలోకి చొరబడ్డాడు. ఎస్సై భార్య, పిల్లలు ఒక గదిలో పడుకుని ఉండగా.. పక్కగదిలో ఉన్న బీరువా తాళాలు అక్కడే ఉండడంతో బీరువా తెరిచి బంగారం చోరీ చేశాడు. ఏలూరు నుంచి క్లూస్‌ టీం వచ్చి సంఘటన స్థలంలో పరిశీలన చేశారు. సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో ఎస్సై రెహమాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement