
పడాల నాగన్న (ఫైల్)
జైనథ్: అప్పు చేసి నాటిన విత్తనాలు మొలకెత్తనందుకు మనస్తాపం చెందిన ఒక రైతు చేను వద్దే ఉరేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం జైనథ్ మండలం మార్గుడ గ్రామానికి చెందిన పడాల నాగన్న (56) తనకున్న ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో 15 రోజుల క్రితం పత్తి, కంది విత్తనాలు వేశాడు.
అప్పటి నుంచి వర్షాలు సరిగ్గా కురవకపోగా, ఎండల వల్ల విత్తనాలు మొలకెత్తకపోవడంతో మనస్తాపం చెందాడు. మంగళవారం ఉదయం చేను వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. నాగన్న భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పెర్సిస్ బిట్ల తెలిపారు.