Deekshitha: Parrents Demands Vinod Jain To Be Encounter - Sakshi
Sakshi News home page

కామాంధుడిని ఎన్‌కౌంటర్‌ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు 

Feb 2 2022 4:58 AM | Updated on Feb 2 2022 10:39 AM

Deekshitha Parrents Demands Vinod Jain To Be Encounter - Sakshi

బాలిక తల్లిని ఓదార్చుతున్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి

సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఏలూరు టౌన్‌: విజయవాడలో కామాంధుడు వినోద్‌జైన్‌ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను తలచుకొంటూ తల్లడిల్లిపోతున్నారు. దీక్షిత ఫొటోను దగ్గరపెట్టుకొని, చూసుకొంటూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. సీసీ ఫుటేజీలోని దృశ్యాలను చూసి తట్టుకోలేకపోతున్నారు. దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయండని రోదిస్తున్నారు. మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూడాలని, తమకు ఎదురైన కష్టం మరొకరికి రాకూడదంటూ వేడుకొంటున్నారు. తనకు ఇష్టమైన రంగు డ్రస్‌ వేసుకొని, వాంకింగ్‌కు వెళ్లే ముందు హగ్‌ చేసుకొందని, కరోనా కేసులు పెరుగుతున్నాయమ్మ, వాకింగ్‌ వద్దని చెప్పానని, వెళ్లొస్తానమ్మా అంటూ..వెళ్లిపోయిందని బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతోంది. మెట్లు, లిఫ్ట్‌ వద్ద ఉండి నిందితుడు విష్‌ చేసేవాడని, వయసు రీత్యా తమకు అనుమానం రాలేదని చెప్పారు.   

పరామర్శించిన ఎమ్మెల్సీ... 
బాలిక కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పరామర్శించి ఓదార్చారు. నిందితుడిని నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేసి మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా చూడాలని బాలిక తల్లి తనతో అన్నట్లు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన 
కామాంధుడు వినోద్‌ జైన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు, కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి బాలికకు నివాళులర్పించారు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లోని దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, ఇడా చైర్‌పర్సన్‌ మధ్యాహ్నపు ఈశ్వరి, మేయర్‌ షేక్‌ నూర్జహాన్, స్మార్ట్‌ సిటీ చైర్‌ పర్సన్‌ బొద్దాని అఖిల, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement