వికారాబాద్‌ కాగ్నా నది వద్ద విషాదం | Car Driver Last Breath After Car Crashes Into River In Vikarabad | Sakshi
Sakshi News home page

నదిలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

Aug 18 2020 4:46 PM | Updated on Aug 18 2020 5:24 PM

Car Driver Last Breath After Car Crashes Into River In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: జిల్లా తాండూరు కాగ్నానది వద్ద విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపైన ఉన్న గుంతను తప్పించబోయి పక్కనే ఉన్న నదిలోకి కారు దూసుకేళ్లిన ఘటన మంగళవారం వికారాబాద్‌లో జరిగింది. ఈ ఘటన కారు డ్రైవర్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన సమయంలో అటుగా వెళుతున్న వాహనదారులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు బాధితుడిని కాపాడలేకపోయారు. సదరు మృతుడిని యాలాల మండల వాసిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement