 
															చేపల వలలో భారీ కొండచిలువ
పూతలపట్టు(యాదమరి): చేపల కోసం వేసిన వలకు ఓ భారీ కొండ చిలువ చిక్కిన ఘటన మండలంలోని నీవా నదిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమ వారం నీవానదిలో కొందరు చేపల వేట కోసం వల వేశారు. అనూహ్యంగా అందులో చేపలకు బదు లు భారీ కొండచిలువ పడింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచార అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను బయటకు తీసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
