పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే | - | Sakshi
Sakshi News home page

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

Oct 31 2025 7:51 AM | Updated on Oct 31 2025 7:51 AM

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

గంగాధరనెల్లూరు: పిల్లల బాధ్యత తల్లిదండ్రులదేనని చిత్తూరు సీనియర్‌ సివిల్‌ జడ్జీ ఎం.భారతి అన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన న్యాయవి/్ఞాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లలు పాఠశాలకు, కాలేజీలకు సరైన పద్ధతిలో వెళ్తున్నారా.. లేదా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు సామాజికి స్ఫృహ తప్పితే ఆడ్డదారులు తొక్కే అవకాశం ఉందన్నారు. అలాంటి వాటికి పిల్లలు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల తగాదాలు, భూ వివాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు పోలీస్‌ స్టేషన్‌, కోర్టులకు పోకుండా గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలని చెప్పారు. కొన్ని తప్పుడు యాప్‌ల ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్నారని, అలాంటి వాటి వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవన్నారు. నవంబర్‌ 13న చిత్తూరులో లోక్‌ అదాలత్‌ జరుగుతుందని, దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ, ఎంపీడీఓ మనోహర్‌గౌడ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌, ఏఎస్‌ఐ మురళీప్రసాద్‌, ఎంఈఓ ఆంజనేయులుశెట్టి, ఏపీఎం ఫరీద్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నూతన విధానం, కేడర్‌ స్ట్రెంత్‌, పొజిషన్‌ ఐడీల ఖరారు నిమిత్తం రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్‌ విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశా రు. ఆ ఉత్తర్వులు గురువారం డీఈవో కార్యాలయానికి చేరాయి. జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న ఏడీ, సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, అసి స్టెంట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌, ప్రతి మండలం నుంచి ఎంఈవో–1, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్‌లు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌నకు సంబంధిత నివేదికలతో హాజరుకావాలన్నా రు. చిత్తూరు జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు నవంబర్‌ 18న రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌ ఉంటుందన్నారు. ఆ లోపు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement