
వరసిద్ధుని బ్రహ్మోత్సవానికి ముహూర్తం ఖరారు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 27వ తేదీ నుంచి బ్రహ్మో త్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకచవితి రోజు నుంచే ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 28న ధ్వజారోహణం, హంసవాహనం, 29న బంగారు నెమలి వాహనం, 30న మూషికవాహనం, 31న బంగారు చిన్న, పెద్ద శేష వాహనం, సెప్టంబర్ 1న చిలుక వాహనం, వృషభవాహనం, 2వ తేదీ గజవాహనం, 3న రథోత్సవం, 4న తిరు కల్యాణం, 5న ధ్వజారోహణం, ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. ఆపై ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 6వ తేదీ అధికార నంది వాహనం, 7న రావణబ్రహ్మ వాహనం, 8న యాళి వాహనం, 9న సూర్యప్రభ వాహనం, 10న చంద్రప్రభ వాహనం, 11న కల్పవృక్ష వాహనం, 12న విమానోత్సవం, 13న పుష్పపల్లకి, 14న కామధేను వాహనం, 15న పూలంగిసేవ, 16న తెప్పోత్సవం ముగియనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు.