
నకిలీ టోకెన్లు విక్రయించిన వ్యక్తి అరెస్ట్
కార్వేటినగరం: ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో కలకలం రేపిన నకిలీ టోకెన్ల విక్రయం ఘటనలో సచివాలయ ఆర్టికల్చర్‌ని అరెస్టు చేసినట్లు కార్వేటినగరం సీఐ హనుమంతప్ప తెలిపారు. శనివారం తన కార్యాలయ ఆవరణంలో నిందితుడ్ని అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండల పరిధిలోని చింతమండి వద్ద ఉన్న ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ నమోదు కోసం డీఎంపురం సచివాయ హార్టికల్చర్ అధికారి విధులకు కేటాయించిందన్నారు. ఇతను పుత్తూరు మండలం, నందిమంగళం గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు వెంకటేష్(31) అని పేర్కొన్నారు. అతను ఫ్యాక్టరీ వద్ద నకలీ టోకెన్లు సృష్టించి రైతులకు అమ్మి సొమ్ముచేసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో టోకెన్ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు విక్రయించినట్టు తెలిపారు. ఇలా సుమారు 31 నకిలీ టోకెన్లు బయటపడ్డాయన్నారు. ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.