
అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు
నగరి : అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం మండలంలోని ఓజీ కుప్పం ఇసుక రీచ్‌ను ఆయన పరిశీలించారు. ఈరీచ్‌కు అనుమతి గడువు పూర్తయినా ఇప్పటికీ ఇసుక రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. వెంటనే ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే సమీప గ్రామాల్లో సైతం ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టామ్ టామ్ వేయించాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 14 ఇసుక రీచ్‌లను భూగర్భ గనులు శాఖ జిల్లా అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సెబ్, ఎకై ్సజ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, రవాణా శాఖల అధికారులతో కలసి పరిశీలించామన్నారు. వీటన్నింటికీ అనుమతి గడువు పూర్తయిందని, ఇకపై ఎక్కడా ఇసుక రవాణా జరగకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ, సెబ్ ఇన్‌చార్జి సుబ్బరాజు, భూగర్భ గనుల శాఖ అధికారి ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈఈ మదన్‌మోహన్, డీపీఓ లక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.