
ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి
పెనుమూరు(కార్వేటినగరం) : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అధికార పగ్గాలు చేపడతారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం స్పష్టం చేశారు. సోమవారం పెనుమూరు మండలం పెద్ద కావూరి వారిపల్లె, మోపిరెడ్డిపల్లె, గుడ్యాణంపల్లె పంచాయతీల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కళత్తూరు కృపాలక్ష్మికి ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నానాజాతి సమితిగా కూటమి కట్టిన పార్టీలు ఒక్క వైపు ఉంటే, సంక్షేమం, చక్కటి అజెండాతో ప్రజా ఆశీస్సులు కోరుతూ జగనన్న ఒక్కరే ఓ వైపు ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు విజయకుమార్, మండల మాజీ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, ఎంపీపీ హేమలతరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దొరస్వామి, సింగిల్ విండో అధ్యక్షుడు గోవిందరెడ్డి, నియోజకవర్గ మహిళ అధ్యక్షులు యశోదారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కమలాకరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూది మోహన్, వైస్ ఎంపీపీ కోదండన్, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి గిరిధర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కృష్ణారెడ్డి, మండల యువత అధ్యక్షుడు లోకేష్ రెడ్డి, నేతలు పులికల్లు బాలాజీరెడ్డి, పూర్ణ చంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డి, దేవరాజులు రెడ్డి, గంధం ముని, నీలా పండరినాథ్, గంగుపల్లె రవి, మాజీ సర్పంచ్‌లు ఎన్.నరసింహారెడ్డి, పి.ఈశ్వరరెడ్డి, రాజారెడ్డి, దాము పాల్గొన్నారు.