నేడు పెద్దిరెడ్డి, మిఽథున్‌రెడ్డి నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

నేడు పెద్దిరెడ్డి, మిఽథున్‌రెడ్డి నామినేషన్లు

Apr 19 2024 1:55 AM | Updated on Apr 19 2024 1:55 AM

మాట్లాడుతున్న అకౌంట్స్‌ అధికారి శ్రీనివాసులు  - Sakshi

మాట్లాడుతున్న అకౌంట్స్‌ అధికారి శ్రీనివాసులు

పుంగనూరు : వైఎస్సార్‌సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. స్థానిక హనుమంతరాయునిదిన్నెలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో పెద్దిరెడ్డి ముందుగా పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి రామసముద్రం రోడ్డు, ఎన్‌ఎస్‌ పేట, పుంగమ్మ చెరువు కట్ట, బ్రాహ్మణవీధి, సెంటర్‌ లాడ్జి, నాగపాళ్యెం, ఇందిరా సర్కిల్‌ మీదుగా గోకుల్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అలాగే ఎంపీ మిథున్‌రెడ్డి తరఫున సీమ జిల్లాల మైనారిటీ సెల్‌ ఇన్‌చార్జి ఫకృద్ధీన్‌షరీఫ్‌ ఆధ్వర్యంలో ముస్లింలు రాయచోటికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

నెలాఖరుకు వర్క్‌ ఆర్డర్లు క్లోజ్‌

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో అర్బన్‌ డివిజన్‌ పరిధిలోని ఏఈలు పెండింగ్‌లో ఉండే వర్క్‌ఆర్డర్లను ఈనెలాఖరులోపు క్లోజ్‌ చేయాలని సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఈఈ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్క్‌ఆర్డర్ల పై ప్రతినెలా గడువు ఇస్తున్నా ఏఈల తీరులో మార్పు రాలేదన్నారు. ఇప్పటికై నా పద్ధతి మార్చుకుని పనులు క్లోజ్‌ చేయాలని సూచించారు. డివిజన్‌ పరిధిలో పెండింగ్‌లోనిరూ.5 కోట్ల ప్రైవేటు సర్వీసుల మొండి బకాయిలను వసూలు చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత సర్వీసులకు విద్యుత్‌ సరఫరా తొలగించినా, డబ్బులు సంస్థకు చెల్లించేలా కృషి చేయాలన్నారు. ప్రతినెలా 7వ తేదీలోపు వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులను అందజేయాలని ఆదేశించారు. వందశాతం బిల్లుల వసూలుకు కృషి చేయాలని కోరారు. సెక్షన్ల పరిధిలో అదనపులోడ్‌ సర్వీసులను గుర్తించి క్రమబద్ధీకరణ చేయించాలని సూచించారు. సమావేశంలో ఈఈ పద్మనాభపిళ్‌లై, డీఈలు శేషాద్రి, జ్ఞానేశ్వర్‌, జేఏఓ గోవిందరాజులు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ

సమావేశం రేపు

చిత్తూరు కార్పొరేషన్‌: ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా శనివారం జెడ్పీ 1–7 స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ గ్లోరియా గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. తాగునీటి సమస్య, వైద్య ఆర్యోగశాఖ అంశాల పై సమీక్షించనున్నట్లు వెల్లడించారు. జెడ్పీటీసీ సభ్యులు హాజరు కావాలని కోరారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement