భలే మంచి కండువా బేరం | - | Sakshi
Sakshi News home page

భలే మంచి కండువా బేరం

Apr 12 2024 1:50 AM | Updated on Apr 12 2024 1:50 AM

- - Sakshi

జంపింగ్‌ జపాంగ్‌ల కారణంగా పార్టీ నాయకులకు తలనొప్పులు వస్తున్నాయి. ఈ రోజు పార్టీలో చేరిన వ్యక్తి పూట గడవక మునుపే సొంతగూటికి చేరుతుండడంతో కలవర పడుతున్నారు. అపోజిషన్‌ పార్టీ నేతలను ఇటువైపు లాక్కోవడానికి టీడీపీలోని కొందరు స్పెషలిస్టులు పన్నాగం పన్నుతారు. ఏదో కథ చెప్పి పార్టీ అధిష్టానం వద్ద కండువా వేయించి ఎంతోకొంత నగదు ముట్టజెప్పేలా చూస్తారు. ఆ నగదు అయిపోయేవరకు డాబాల్లో రాజకీయం స్టార్ట్‌ చేస్తారు. ఇంతవరకు బాగానే ఉన్న పార్టీ మారిన వ్యక్తి తనకు క్షవరం అయిందన్న విషయం తెలుసుకుని సొంతగూటికి చేరుకునే పనిలో పడుతున్నారు.

పలమనేరు: ఈరోజు ఓ పార్టీలో చేరుతున్నట్లు కండువా వేసుకోవడం, మరుసటిరోజు మరో పార్టీలో కండువా వేసుకోవడం పలమనేరు నియోజకవర్గంలో ఫ్యాషన్‌గా మారింది. గత కొన్నాళ్లుగా ఇలాంటి జంపింగ్‌ జిలానీలను చూస్తున్న జనం ఇదేం ఖర్మరాబాబు అనుకుంటున్నారు. మరోవైపు కండువాలను వేయించే స్పెషలిస్ట్‌లు సైతం ఇక్కడ పుట్టుకొచ్చారు. పార్టీ నేత వద్దకెళ్లడం తాము ఫలానా వాడిని పట్టేశామని అతను మన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడని, అతనికి ఎక్కువగా ఓట్లున్నాయంటూ చెప్పడం వీరి తొలిపని. వీరిమాట నమ్మి ఆ నాయకుడు అతనికి నిర్ణయించిన నగదు, ఓ స్వీట్‌ బాక్సును కండువా స్పెషలిస్ట్‌లకు అందజేస్తాడు. దీంతో రంగంలోకి దిగిన స్పెషలిస్ట్‌లు జంపింగ్‌ జిలానీలను మునగచెట్టు ఎక్కించి పార్టీలో చేర్పిస్తూ కండువా వేయించి అతన్ని అభినందించి సోషల్‌ మీడియాలో వీడియో, ఫొటోలను వైరల్‌ చేస్తారు. అంతటితో వీరి పని అయిపోదు. కొత్తగా కండుగా కప్పుకున్న వ్యక్తికి ఆ పార్టీ నాయకుడు ఇచ్చిన డబ్బును డాబాల్లో విందులతో మొత్తం ఖాళీ చేయించేదాకా వదలరు ఈ స్పెషలిస్టులు. రాత్రంతా ఆలోచించి, ఆ పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఉదయం లేచి తనకు బాగా కావాల్సిన వాళ్ల దగ్గర జరిగిన గోడును వెళ్లబోసుకుంటాడు. అంతే మరో బ్యాచ్‌ రంగంలోకి దిగి అతన్ని శాంతింపజేసి తిరిగిసొంత గూటికి చేర్చడం ఇక్కడ రివాజుగా మారింది.

వందమంది టార్గెట్‌..పచ్చబ్యాచ్‌ స్కెచ్‌

నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ఓట్లను బట్టి ఇతర పార్టీలు, తటస్తులతో వందమంది దాకా జాబితాను పచ్చ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. వీరికి ఉన్న ఓట్లను బట్టి అతని తలకు రేటు కట్టి దాంతో పైరవీలు జరగుతున్నట్టు ఇక్కడ జనంలో టాక్‌. ఆ లెక్కన చిన్నపాటి నేతకై తే రూ.10 వేల నుంచి రూ.50 వేలదాకా పలికే చేపలకే వీరు గాళం వేస్తున్నట్టు ఈ మధ్య జరిగిన కండువాల వ్యాపారం చూస్తుంటే అర్థమవుతోంది.

ఇంత చేసినా ఎగిరిపోతున్న చేపలు..

ఎన్నో మాటలు చెప్పి కండువాలు మార్చినా సంబంధిత వ్యక్తులు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. దీన్ని చూసి పచ్చబ్యాచ్‌కు కడుపుమండుతోంది. ఏదేమైనా ఇలాంటి డబుల్‌గేమ్‌ ఆడుతున్న వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎవరైనా పార్టీలో చేరే నేతకు ఎంతమేరకు ఓటర్లను ప్రభావితం చేస్తాడో లెక్కగట్టకుండా ఏదో కండువాలు వేయించామా అంటూ పార్టీని హైప్‌ చేసే ప్రయత్నాలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. బుట్టలో నుంచి ఎగిరిపోతు న్న వారికి ఉన్న ఓట్లు ఎగిరిపోవడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement