
కుంకుమార్చనలో భక్తులు
బంగారుపాళెం: మండలంలోని తిమ్మోజుపల్లె ఆర్‌బీకేలో శుక్రవారం చిత్తూరు ఆత్మ ఆధ్వర్యంలో స్కిల్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ (ఎస్‌టీఆర్‌వై) ద్వారా పంటలను ఆశించే చీడపీడల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ పంటల సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. చీడపీడలు నివారణకు వ్యవసాయాధికారుల సూచన మేరకు తగిన మోతాదులో రసాయన ఎరువులు, మందులు వినియోగించాలని తెలిపారు. సేంద్రియ విధానాలపై దృష్టి సారించాలని సూచించారు. సలహాలు అవసరమైన రైతులు 155251 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులతో పాటు పురుగు మందులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందన్నారు. రైతులు డీడీ ద్వారా నగదు చెల్లిస్తే రెండు, మూడు రోజుల్లో సరఫరా చేస్తారని వెల్లడించారు. ఈ క్రమంలోనే చీడపీడల నివారణ తీసుకోవాల్సిన సమగ్ర సస్యరణ చర్యలపై ఆత్మ డీపీడీ రత్నప్రసాద్, ఏడీఏ లక్ష్మీదేవి అవగాహన కల్పించారు. వ్యవసాయాధికారి చిట్టిబాబు, విస్తరణాధికారి సాదరయ్య పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట గణపతి హోమం, చండీ హోమం జరిపించి పూర్ణాహుతి, మంగళహారతి సమర్పించారు. అనంతరం చేపట్టిన కుంకుమార్చనలో మొత్తం 167 మంది దంపతులు పాల్గొన్నారు. భక్తులకు ఆలయం తరఫున పూజా సామగ్రి అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి చేతులమీదుగా దంపతులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే అమ్మవారికి భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకం నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజేష్, రామ్‌దాస్, భారతి, బుడ్డమ్మ, పవన్‌కుమార్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మీదేవమ్మ, హైమావతి, రెడ్డెప్ప పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో ఆస్పత్రి సేవలు
చిత్తూరు రూరల్: జిల్లా ఆస్పత్రిలో చేపట్టే ప్రతి సేవను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌పై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. డీసీహెచ్‌ఎస్ మాట్లాడుతూ ఆస్పత్రిలో జరిగే సర్జరీలు, ప్రసవాలు, ఇతర సేవల వివరాలతో ఇకపై పక్కాగా నివేదికలు తయారు చేయాలన్నారు. వాటిని నెల వారీగా ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్‌లో నమోదు చేయించాలని సూచించారు. ఈ మేరకే ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. అందుకోసం ఆస్పత్రికలో సేవల పరిధి పెంచాలని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు జార్జ్, ప్రసాద్ పాల్గొన్నారు.
నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
చిత్తూరు రూరల్: పంచాయతీల్లో చేపట్టే ప్రతి పనిలోనూ నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని బ్యూరో స్టాండర్డ్ ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ షణ్ముఖ శివన్, డీపీఆర్‌సీ జిల్లా కో–ఆర్డినేటర్ షణ్ముఖ రామ్ ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో పాటించాల్సిన నాణ్యతాప్రమాణాలపై అవగాహన కల్పించారు. అలాగే కార్యాలయాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

మాట్లాడుతున్న షణ్ముఖశివన్

మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ

మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌రెడ్డి