షావోమి ఫస్ట్‌ ఎలక్ట్రిక్ కార్‌ ఫోటోలు లీక్‌, లుక్‌ మాములుగా లేవుగా!

Xiaomi MS11 Electric Car Photos Leak Ahead Of Global Debut - Sakshi

సాక్షి,ముంబై:   చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి ఎలక్ట్రిక్​ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావోమీ తొలి ఎలక్ట్రిక్​ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్‌గా అరంగేంట్రం  చేయనున్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

చైనాలో ఈవీ మార్కెట్ చాలా పోటీ ఉంది. దీంతో షావోమీ కారుకు మరింత ప్రాధాన్యతను సంతరించు కుంది. షావోమీ ఎం​ఎస్​11 సెడాన్​ పేరుతో  తీసుకొస్తున్న సెడాన్‌ డిజైన్‌, లుక్‌  ఆకర్షణీయంగా మారింది. ఇది పోర్షే టైకాన్‌తో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ చైనీస్​ ఆటో మొబైల్​ సంస్థ బీవైడీకి చెందిన సియెల్​ ఎలక్ట్రిక్​ సెడాన్‌ తరహాలో షావోమి ఈవీ డిజైన్‌ ఉండనుందని అంచనా. అంతేకాదు కారు ముందు భాగంలో LiDAR సెన్సార్‌ ఆధారంగా  ఇది అటానమస్‌ సెల్ఫ్‌  డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తోందని కూడా భావిస్తున్నారు.

షావోమీ 4 డోర్​  ఎం​ఎస్​11 చాలా ఆకర్షణీయమైన సెడాన్ అని సోషల్‌ మీడియా ప్రశంసిస్తోంది. స్పోర్టీగా కనిపించే 4-డోర్ల ఎలక్ట్రిక్ వాహనంలో విండ్‌షీల్డ్‌ పెద్దగా  ఉండి, పైకప్పు మొత్తం ఒక సింగిల్ పేన్ గ్లాస్‌తో  టెస్లా మోడల్‌లలో కని పిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లాయ్ వీల్స్‌ అమర్చింది. ఈ వీల్స్​ మధ్యలో "షావోమీ’’ బ్రాండ్​ లోగో కనిపిస్తోంది. తుదిమెరుగులు దిద్దుకున్న షావోమీ ఈవీ టెస్టింగ్‌ను కూడా​  చైనా రోడ్లపై ఇప్పటికే నిర్వహించిందట. 

రూ. 1.2కోట్ల ఫైన్​..!
అయితే తొలి ఎలక్ట్రిక్​ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌ లీక్​ కావడంపై షావోమీ సీరియస్‌గా స్పందించింది. బీజింగ్‌కు చెందిన మోల్డింగ్​ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్​ అనే వెండర్​ ద్వారా  ఈ ఫొటోలు లీక్​ అయినట్టు  గుర్తించారు. ఈ లీక్‌ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని  సీఈఓ లీ జున్  మండిపడ్డారు. అలాగే సెక్యూరిటీ బ్రీచ్​కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించారు.  సంస్థపై 1 మిలియన్​ యువాన్ల ( దాదాపు. రూ.1.22కోట్లు) జరిమానా  విధించనుందట షావోమీ. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top