వీఎల్‌సీసీ సీఈవోగా వికాస్‌ గుప్తా | VLCC appoints Vikas Gupta as new CEO | Sakshi
Sakshi News home page

వీఎల్‌సీసీ సీఈవోగా వికాస్‌ గుప్తా

Apr 12 2023 4:31 AM | Updated on Apr 12 2023 4:31 AM

VLCC appoints Vikas Gupta as new CEO - Sakshi

న్యూఢిల్లీ: వెంటనే అమల్లోకి వచ్చే విధంగా వికాస్‌ గుప్తాను కొత్త సీఈవోగా నియమించినట్లు బ్యూటీ, స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ వీఎల్‌సీసీ పేర్కొంది. జయంత్‌ ఖోస్లా స్థానే వికాస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 2022 డిసెంబర్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవడంతో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ కార్లయిల్‌ నిర్వహణలోకి వీఎల్‌సీసీ చేరింది. కాగా.. గుప్తా ఇంతక్రితం నైకాకు చెందిన ఈబీటూబీ బిజినెస్‌(సూపర్‌స్టోర్‌)కు సీఈవోగా వ్యవహరించారు.

గ్లోబల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ గ్రూప్‌ ఈకామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లోనూ పనిచేశారు. 2019–21 మధ్య చీఫ్‌ కస్టమర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. తొలుత ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌)లో కెరీర్‌ను ప్రారంభించిన గుప్తా వివిధ హోదాలలో 21 ఏళ్లపాటు సేవలందించారు. 1989లో ఏర్పాటైన వీఎల్‌సీసీ గ్రూప్‌ ప్రస్తుతం స్కిన్‌కేర్, బ్యూటీ, వెల్‌నెస్‌ విభాగాలలో మల్టీఔట్‌లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement