యూబీఎస్‌ చేతికి క్రెడిట్‌ సుసీ

Ubs Takes Over Credit Suisse - Sakshi

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్‌ సుసీను కొనుగోలు చేసేందుకు స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ గ్రూప్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. స్విస్‌ ప్రభుత్వ దన్నుతో 2 బిలియన్‌ డాలర్ల(రూ. 16,500 కోట్లు)కు ఒప్పందం కుదిరినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.

షేర్ల జారీ ద్వారా కుదిరిన డీల్‌ ప్రకారం క్రెడిట్‌ సుసీ విలువ 8 బిలియన్‌ డాలర్లుగా తెలియజేసింది. క్రెడిట్‌ సుసీ షేరు శుక్రవారం ముగింపు ధరతో పోలిస్తే నాలుగో వంతు ధరలో యూబీఎస్‌ కొనుగోలు చేయనుంది. గత వారం నాలుగు యూఎస్‌ బ్యాంకులు వైఫల్యం చెందిన నేపథ్యంలో క్రెడిట్‌ సుసీ షేరు, బాండ్లకు షాక్‌ తగిలింది. స్విస్‌ కేంద్ర బ్యాంకు లిక్విడిటీ మద్దతునిచి్చనప్పటికీ మార్కెట్లో క్రెడిట్‌ సుసీ షేరు పతనమైంది.

తాజాగా క్రెడిట్‌ సుసీను టేకోవర్‌ చేసేందుకు స్విస్‌ ప్రభుత్వం నుంచి రిసు్కలకుగాను 6 బిలియన్‌ డాలర్ల గ్యారంటీని యూబీఎస్‌ కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top