
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 112.62 పాయింట్ల లాభంతో 66241.07 వద్ద, నిఫ్టీ 27.20 పాయింట్ల లాభంతో 19746.45 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు లాభాలతో సాగుతున్న కంపెనీల జాబితాలో ప్రధానంగా లార్సెన్ & టబ్రో (Larsen & Toubro), కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా, LTIMindtree ఉన్నాయి. నష్టాలు చవి చూసిన సంస్థల లిస్ట్‌లో టైటాన్ కంపెనీ, గ్రాసిమ్, హీరో మోటోకార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బీపీసీఎస్ (BPCL) చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)