
మూడీస్‌తో సహా పలు అంతర్జాతీయ రేటింగ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై పాజిటీవ్ రేటింగ్స్ ఇచ్చాయి. శుక్రవారం ఉదయం 10గంటల సమయంలో గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్‌పై అభిప్రాయాన్ని వ్యక్తం చేయనుంది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాలతోప్రారంభమయ్యాయి.
శుక్రవారం ఉదయం 9.15గంటల సమయానికి సెన్సెక్స్ 282.56 పాయింట్లు లాభపడి 59960 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుండగా..నిఫ్టీ సైతం 96.5పాయింట్ల లాభంతో 17886.85 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంది.
ఇక వరల్డ్ వైడ్‌గా చిప్ కొరత వేధిస్తున్నా ఆటోమొబైల్ షేర్లు లాభాల్ని మూటగట్టుకుంటున్నాయి. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్ని గడిస్తుండగా ఓఎన్‌జీసీ,టాటా స్టీల్,హిందాల‍్కో,జేఎస్‌డబ్ల్యూ షేర్లు సైతం లాభాల్ని కంటిన్యూ చేస్తున్నాయి.కోల్ ఇండియా,హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్,హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.