అమెజాన్‌ అధినేతకు బంపరాఫర్‌.. జెఫ్‌ బెజోస్‌ చేతికి భారీ నాసా కాంట్రాక్ట్‌!

A Team Led By Jeff Bezos Blue Origin Won A Nasa Contract - Sakshi

యాబై ఏళ్ల తర్వాత చంద్రుడి మీదకు మనుషులను పంపించే అర్టెమిస్‌ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ భారీ నాసా కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకున్నారు.  

2000 సంవత్సరంలో బెజోస్‌ ఏరో స్పెస్‌ కంపెనీ బ్లూ ఆరిజన్‌ని స్థాపించిన విషయం తెలిసింది. తాజాగా నాసా ‘ఆర్టెమిస్‌ వి’ ప్రాజెక్ట్‌లో భాగంగా బ్లూ ఆరిజన్‌ సంస్థ ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుని మీదికి (మూన్‌ సర్ఫేస్‌) పంపే స్పేస్‌క్రాఫ్ట్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఇదే విషయాన్ని నాసా చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు.

నాసా నిర్ణయంతో రెండో ప్రాజెక్ట్‌పై బ్లూ ఆరిజన్‌ పనిచేయనుంది. ఇప్పటికే అర్టెమిస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఆస్ట్రోనాట్స్‌ లూనార్‌ సర్ఫేస్‌లోకి అడుగు పెట్టేలా స్టార్‌షిప్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లను తయారు చేసింది. 2021లో అదే స్టార్‌షిప్‌ స్పేస్‌ క్రాప్ట్‌ సాయంతో లూనార్‌ సర్ఫేస్‌లోకి ఆస్ట్రోనాట్స్‌ విజయ వంతంగా కాలు మోపారు. దాదాపూ పదేళ్ల తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్‌ విజయవంతంమైంది. దీని విలువ సుమారు 3 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 24,850 కోట్లు. 

బ్లూ ఆరిజన్‌ ప్రాజెక్ట్‌ విలువ రూ.28,150 కోట్లు 
ఇక తాజాగా జెఫ్‌ బెజోస్‌ సంస్థ బ్లూ ఆరిజన్‌ నాసా నుంచి దక్కించుకున్న కాంట్రాక్ట్‌ విలువ అక్షరాల 3.4 బిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ.28,150 కోట్లని నాసా ఎక్స్‌ప్లోరేషన్‌ చీఫ్‌ జిఫ్‌ ఫ్రీ తెలిపారు. 

సంతోషంగా ఉంది. 
నాసా ప్రాజెక్ట్‌ దక్కించుకోవడంపై బెజోస్‌ ట్వీట్‌ చేశారు. ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు అడుగు పెట్టే నాసా ప్రయత్నాల‍్లో తాను ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. 

2029లో ప్రారంభం కానున్న ప్రయోగం
నాసా కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్న బెజోస్‌ కంపెనీ బ్లూ ఆరిజన్‌ 50 అడుగుల పొడవైన ‘బ్లూమూన్‌’ అనే స్పేస్‌ క్ట్రాఫ్ట్‌ను తయారు చేయనుంది. తయారీ అనంతరం ఈ స్పేస్‌ క్రాప్ట్‌లో నలుగురు ఆస్ట్రోనాట్స్‌ ప్రయాణించి మూన్‌ సర్ఫేస్‌లో అడుగు పెట్టనున్నారు.

చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top