సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్

Tata Power Renewable Energy Completed 150 MW solar project in Rajasthan - Sakshi

సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పరంగా టాటా పవర్ దూసుకెళ్తుంది. టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(టీపీఆర్ఈఎల్) రాజస్థాన్‌లోని లోహర్కి గ్రామంలో 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. రాజస్థాన్‌లోని ఈ ప్రాజెక్టుతో టాటా పవర్ మొత్తం పునరుత్పాదక వ్యవస్థాపన సామర్థ్యం 2,947 మెగావాట్ల(2,015 మెగావాట్ల సోలార్, 932 మెగావాట్ల విండ్ పవర్)కు చేరుకుంది. ఇంకా 1,084 మెగావాట్ల పునరుత్పాదక టాటా పవర్ ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. 756 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 350 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. 

ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది 3.34 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.5 లక్షల మాడ్యూల్స్, 48 ఇన్వర్టర్లు, 720 కిలోమీటర్ల డీసీ కేబుల్, 550 మ్యాన్ పవర్ ఉపయోగించారు. "రాజస్థాన్‌లోని లోహర్కిలో నిర్మించిన 150  మెగావాట్ల ప్రాజెక్టు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థలో ఒకటిగా మా స్థానాన్ని సుస్థిరం చేసింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి వృద్ధిని ఇదేవిధంగా మేము కొనసాగిస్తాము" అని టాటా పవర్ సీఈఓ, ఎండి డాక్టర్ ప్రవీర్ సాహా తెలిపారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా టీపీఆర్ఈఎల్ ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: డిసెంబరే టార్గెట్‌.. ఎయిరిండియాను అమ్మేయడానికే)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top