టాటా పవర్‌ నిధుల సమీకరణ

Tata Power Gains On Raising Rs 1000 Crore Via Ncd - Sakshi

ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా పవర్‌ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌లో భాగంగా 10,000 అన్‌సెక్యూర్డ్, రీడీమబుల్, ట్యాక్సబుల్, లిస్టెడ్, రేటెడ్, ఎన్‌సీడీలను జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

రూ. 500 కోట్ల విలువైన సిరీస్‌–1 ఎన్‌సీడీలకు 2030 జనవరి 8న, మరో రూ. 500 కోట్ల విలువైన సిరీస్‌–2 ఎన్‌సీడీలకు 2032 డిసెంబర్‌ 29న గడువు ముగియనున్నట్లు తెలియజేసింది. ఈ బాండ్లను బీఎస్‌ఈలో లిస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్‌సీడీల జారీ వార్తల నేపథ్యంలో టాటా పవర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top