
ముంబై: సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ స్టెల్లార్ వాల్యూ చైన్ ఆరు నగరాల్లో గిడ్డంగులను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది.
హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతలో ఇవి రానున్నాయి. మొత్తం 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని అందుబాటులోకి తేవాలన్నది ప్రణాళిక. డైరెక్ట్ టు కస్టమర్ బ్రాండ్లకు వెన్నెముకగా నిలిచేందుకు ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను నెలకొల్పుతున్నట్టు కంపెనీ తెలిపింది.
చదవండి: కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!