ఎంఎస్‌సీఐలో చోటు- షేర్ల హైజంప్‌

Shares zoom due to including in MSCI India index - Sakshi

జాబితాలో అదానీ గ్రీన్, ట్రెంట్‌, యస్‌ బ్యాంక్‌

బాలకృష్ణ, అపోలో హాస్పిటల్స్‌, ఇప్కా, ఎంఆర్ఎఫ్‌

పలు కౌంటర్లు 2-12 శాతం మధ్య ర్యాలీ

ముంబై: ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు పెట్టుబడులకు ప్రామాణికంగా పరిగణించే ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌ తాజాగా సవరణలు చేపట్టింది. ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే సమీక్షలో భాగంగా 12 షేర్లకు చోటు కల్పించనుంది. మరో రెండు షేర్లను ఇండెక్సు నుంచి తొలగించనుంది. అదానీ గ్రీన్, ట్రెంట్‌, యస్‌ బ్యాంక్‌
బాలకృష్ణ, అపోలో హాస్పిటల్స్‌, ఇప్కా ల్యాబొరేటరీస్‌, ఎంఆర్ఎఫ్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, పీఐ ఇండస్ట్రీస్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ జాబితాలో చోటు సాధించనున్నాయి. అయితే బాష్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ను తొలగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండెక్సుల ఏర్పాటు, నిర్వహణలో ఎంఎస్‌సీఐ అతిపెద్ద సంస్థకాగా.. పలు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ఈ ఇండెక్స్‌ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు చేపడుతూ ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండెక్సులో భాగంకానున్న కంపెనీల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. వెరసి లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

జోష్‌లో..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 898 వద్ద ఫ్రీజయ్యింది. యస్‌ బ్యాంక్ 5 శాతం పెరిగి రూ. 44.15 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6.5 శాతం జంప్‌చేసి రూ. 1571ను తాకగా.., అపోలో హాస్పిటల్స్ 7 శాతం దూసుకెళ్లి రూ. 2,168కు చేరింది. ఈ బాటలో పీఐ ఇండస్ట్రీస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2303 వద్ద‌, ట్రెంట్‌ 2 శాతం పెరిగి రూ. 710 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో పీఐ రూ. 2325 వద్ద, ట్రెంట్‌ రూ. 780 వద్ద గరిష్టాలకు చేరాయి. ఇక కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2 శాతం లాభంతో రూ. 1,790ను తాకగా.. ఎంఆర్‌ఎఫ్‌ 1 శాతం బలపడి రూ. 70,064కు చేరింది. అయితే తొలుత రూ. 3105కు పెరిగిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ ప్రస్తుతం 3.4 శాతం క్షీణించి రూ. 2923 వద్ద కదులుతోంది. తొలుత రూ. 2145కు జంప్‌ చేసిన ఇప్కా ల్యాబ‍్స్‌ 1.3 శాతం క్షీణించి రూ. 2034 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా ఇంట్రాడేలో రూ. 1215కు ఎగసిన ముత్తూట్‌ ఫైనాన్స్ ‌2 శాతం నీరసించి రూ.1161 వద్ద కదులుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top