కొనుగోళ్ల జోరు : 558 పాయింట్లు జంప్

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల అనుకూల సంకేతాలతో ఆరంభంనుంచి చివరికి దాకా జోరు కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 558 పాయింట్లు లేదా 1.47 శాతం పెరిగి 38,493 వద్ద ముగియగా, నిఫ్టీ 169 పాయింట్లు ఎగిసి 11,300 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఆటో, మెటల్, ఐటీ షేర‍్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ కూడా లాభపడింది. దీంతో నిఫ్టీ 11300 ఎగువన ముగిసింది. కరోనావైరస్‌పై పోరులో భాగంగా అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రభావితం చేసిందని మార్కెట వర్గాల అంచనా.
ఫలితాల ప్రభావంతో అల్ట్రాటెక్ సిమెంట్ 7.16 శాతం ఎగియగా, టాటా మోటార్స్ , టీసీఎస్ ఒక్కొక్కటి 4.67 శాతం లాభాలతో టాప్ విన్నర్స్‌గాఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిమ్, ఎం అండ్ ఎమ్, హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, శ్రీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా లాభపడినవాటిలోఉండగా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ , జీ, ఐసీఐసీఐ, నెస్లే, ఓఎన్‌జీసీ, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌గాఉన్నాయి. మరోవైపు డాలరుమారకంలో రూపాయి స్వల్ప నష‍్టంతో ముగిసింది. మంగళవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 1 పైసలు తగ్గి 74.84 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డే గరిష్ట స్థాయి 74.71, 74.90 కనిష్టాన్ని తాకింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి