లాభాల జోరు: 50 వేల ఎగువకు సెన్సెక్స్

నిఫ్టీ 14900 ఎగువకు
తిరిగి 50 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాటి లాభాల ట్రెండ్‌ను గురువారం కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఆరంభ లాభాల నుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 414 పాయింట్ల లాభంతో 50071 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 14946 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల కాస్త నెమ్మదించిన సూచీలు వరసగా మూడో సెషన్‌లో లాభపడుతుండటం విశేషం. నిఫ్టీ బ్యాంక్, ఐటీ ర్యాలీ అవుతున్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హిందాల్కో,విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్ లాభపడుతుండగా, బజాజ్ ఆటో, ఓఎన్‌జిసి, నెస్లే, బ్రిటానియా స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డుతో మరింత వణికు పుట్టిస్తోంది. గురువారం అధికారిక గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,26,789 కేసులు నమోదు కావడం గమనార్హం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి