
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 544, నిఫ్టీ 142 పాయింట్లు జంప్ చేశాయి. దీంతో సెన్సెక్స్ 56 వేల ఎగువకు, నిఫ్టీ 16700 ఎగువన పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.
విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, రిలయన్స్ ఎస్‌బిఐ భారీగా లాభపడుతుండగా, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, హిందాల్కో, సిప్లా కూడా లాభాలనార్జిస్తున్నాయి. మరోవైపు సిమెంట్ రేట్లు పెరగడంతో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ , శ్రీ సిమెంట్స్‌తోపాటు అపోలో హాస్పిటల్, ఎన్టీపీసీ నష్టాల్లో ఉన్నాయి.