
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 282 పాయింట్లు నష్టంతో 52879 వద్ద,నిఫ్టీ 92 పాయింట్లు కుప్పకూలి 15740 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
టైటన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్ టాప్ లూజర్స్‌గా ఉండగా, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం, డా. రెడ్డీస్, సిప్లా, రిలయన్స్ లాభపడుతున్నాయి.