ఐపీవో నిధులపై సెబీ పరిమితులు! | Sakshi
Sakshi News home page

ఐపీవో నిధులపై సెబీ పరిమితులు!

Published Wed, Nov 17 2021 7:56 AM

SEBI Imposes Restrictions On IPO Fundraising - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐపీవో నిధులపై దృష్టి సారించింది. పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే కంపెనీలు ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్న రీతిలో నిధుల వెచ్చింపుపై పరిమితులు ప్రతిపాదించింది. ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొనే నిధులపై పర్యవేక్షణకు తెరతీయనుంది. అంతేకాకుండా కంపెనీలో భారీ వాటా కలిగిన సంస్థ విక్రయానికి ఉంచనున్న షేర్లపై కొన్ని నిబంధనలు రూపొందించింది.

వీటితోపాటు.. యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన ఈక్విటీలో 50 శాతాన్ని 90 రోజులు లేదా అంతకుమించి లాకిన్‌ గడువుకు అంగీకరించిన సంస్థలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 
 

Advertisement
Advertisement